దర్శకుడిగా మారుతున్న ఛత్రపతి కాట్రాజ్.. లిస్టులో ఆ స్టార్ హీరో!

దర్శకుడిగా మారుతున్న ఛత్రపతి కాట్రాజ్..  లిస్టులో ఆ స్టార్ హీరో!

సుప్రీత్ రెడ్డి(Supreeth reddy).. ఈపేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, ఛత్రపతి(Chatrapathi) కాట్రాజ్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఆ సినిమాలో ఆయన చేసిన పాత్ర అలాంటిది మరి. సముద్రంలో సొరణనుకున్నార్ర.. కాట్రాజ్.. కరా.. కరా నమిలేస్త నీ అయ్యా.. అంటూ ఆయన పండించిన విలనిజం సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఆ తరువాత కూడా చాలా సినిమాల్లో విలన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సుప్రీత్ రెడ్డి. అయితే కొంతకాలంగా మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కారణం దర్శకుడిగా కొత్త  ప్రయాణం మొదలుపెట్టనున్నాడట ఈ నటుడు. 

ప్రస్తుతం ఈ వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి నటులు దర్శకులుగా మారడం కొత్తేమి కాదు. ఇటీవలే కమెడియన్ వేణు  బలగం సినిమా చేసి ఆడియన్స్ తోపాటు, ఇండస్ట్రీకి షాకిచ్చాడు. అదేవిదంగా ఇప్పుడు సుప్రీత్ కూడా దర్శకుడిగా మారాలని ఫిక్స్ ఆయ్యాడట. ఆ కారణంగానే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు ఈ నటుడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయని, నటీనటుల ఎంపిక జరుగుతుందని తెలుస్తోంది. 

ఇక ఈ సినిమాలో నటించే హీరో విషయానికి వస్తే.. సుప్రీత్ ఈ కథను నేచురల్ స్టార్ నానికి వినిపించారట. కథ బాగా నచ్చడంతో ఆయన కూడా వెంటనే ఒకే చెప్పేశాడట. ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని తరువాతి సినిమాను బలగం దర్శకుడు వేణు తో చేయనున్నాడని టాక్. ఈ సినిమా పూర్తయిన వెంటనే సుప్రీత్ రెడ్డి సినిమా మొదలుపెట్టనున్నాడట నాని. మరి నటుడిగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సుప్రీత్.. దర్శకుడిగా ఏమేరకు మెప్పిస్తాడో చూడాలి.