బాలింతను, నెల బిడ్డను బుట్టలో మోసుకెళ్లారు

బాలింతను, నెల బిడ్డను బుట్టలో మోసుకెళ్లారు

అంబులెన్స్‌‌‌‌‌‌‌‌ వెళ్లేందుకు ఊరికి రోడ్డు లేక..
చత్తీస్‌‌‌‌‌‌‌‌ గఢ్‌లోని సుర్జాపూర్ ‌‌‌‌‌‌‌‌జిల్లాలో సంఘటన

రాయ్‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెళ్లేందుకు ఆ ఊరికిరోడ్డు లేక హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగా లేని ఓ బాలింతను, నెల వయసున్న బిడ్డను వెదురుబుట్టలో కూర్చోబెట్టి 15 కిలోమీటర్లు మోసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దగ్గర్లోని హాస్పి టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు. చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సుర్జాపూర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జిల్లాలోని ఒడ్జి డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న బైజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పథ్‌ గ్రామానికి చెందిన రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దాసియా(22) ఈ నెల తొలివారంలో ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి అనారోగ్యంగానే ఉంది. సోమవారం ఆమె ఆరోగ్యంమరింత క్షీణించడంతో హెల్త్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇన్ఫామ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చేశారు. తర్వాత ఓ బుట్టలో ఆ బాలింతను, పుట్టిన బిడ్డను కూర్చోబెట్టి భర్తకృష్ణప్రసాద్‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మరో వ్యక్ తిసుమారు 15 కిలోమీటర్లు మోసుకొచ్చారు. అక్కడ నుంచి అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బిహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్త్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు.

నరేగా కింద రోడ్డేయిస్తం: కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సుర్జాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రన్సా య్‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ ఘటనపై స్పందించారు. విషయం తెలిసిన వెంటనే బిహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఓ హెల్త్ టీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోహిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు వెళ్లిందని చెప్పారు. అక్కడి నుంచి అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాని, ఇతర బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు గాని వెళ్లేందుకు రోడ్డులేదని, అందుకే ఆరు కిలోమీటర్లు వాళ్లు తల్లీబిడ్డను మోసుకుంటూ కోహిర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వరకు రావాల్సి వచ్చిందని వివరించారు. అక్కడి నుంచి ఇద్దరినీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చామని, ప్రస్తుతం ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. వానా కాలంలో తమ ఊరి వాళ్ల‌కు చాలా కష్టమవుతోందని, తమ ఊరికి రోడ్డేయాలని బైజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పథ్‌ గ్రామస్తులుస్తు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశా రు. నరేగా స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద ఆ ఊరిని కనెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చేసేలా రోడ్లేస్తామని సుర్జాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ‘ఒడ్గి ఏరియాలో రోడ్లులేని 15 ఊర్లున్ నాయని, దీనిపై పీడబ్ల్యూడీ, ఇతర డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాట్లాడామన్నారు. రెండు, మూడు రోజుల్లో బైజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పథ్‌ గ్రామాన్ని సందర్శిస్తానన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం