ఎంత డబ్బో.. నోట్ల కట్టలు ముందరేసుకొని కూర్చున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

ఎంత డబ్బో.. నోట్ల కట్టలు ముందరేసుకొని కూర్చున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

వ్యక్తి ఎవరైనా.. వృత్తి ఏదైనా.. పని చేసే స్తోమతను బట్టి ఆదాయం ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఒక కూలీ రోజంతా పనిచేస్తే సాయంత్రానికి ఓ 600 నుంచి 800 రూపాయలు చేతిలో పెడతారు. అదే బైక్ నడుపుకుంటూ కాలం వీలదీసే యువకుడి సంపాదన 400 నుంచి 600 రూపాయలు. మరి ప్రజాసేవ అంటూరాజకీయాల్లోకి వచ్చే మన నాయకుల వద్ద కోట్ల డబ్బు ఎలా ఉంటుందో అర్థమవ్వడం లేదు. 

వాస్తవానికి వారు రాజకీయాల్లోకి వచ్చేది.. అనే ప్రజాసేవ ట్యాగ్ లైన్ తోనే కదా! అంటే వచ్చే ఆదాయం ఎంతన్నది మాకు అనవసరం. ప్రజలకు సేవ చేయటమే మా లక్ష్యం అనేది వారి నినాదం. కాదంటారా! మీ నాయకుడిని ప్రశ్నించండి. ఇదే మాటే చెప్తారు. మరి వారు చెప్తున్న ప్రజా సేవ ఏమిటో కానీ.. వారి ఆదాయం మాత్రం ఏడాదికేడాది పెరుగుతూనే పోతోంది. కాదంటారా! అయితే ఇది చూడండి. 

ఛత్తీస్‌గఢ్ లో అధికార పార్టీకి చెందిన ఓ కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే భారీ నోట్ల కట్టలతో కనిపించారు. బెడ్‌పై డబ్బుల కట్టలు ఉండగా.. పక్కనున్న సోఫాలో ఆయన కూర్చొని ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోను జేపీ ప్రధాన కార్యదర్శి ఓపీ చౌదరి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.ఈ వీడియోలో చంద్రపూర్ నియోజకవర్గం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామ్‌కుమార్ యాదవ్. ఆయనతో మాట్లాడుతున్న మరో వ్యక్తి ముఖం మాత్రం స్పష్టంగా కనిపించలేదు.

ఈ వీడియోను పోస్ట్ చేసిన జేపీ ప్రధాన కార్యదర్శి.."ఈ నిజాలను కాంగ్రెస్‌ అంగీకరిస్తుందా?.." అని ప్రశ్నించారు. "మీకు ఇంకా సందేహాలు ఉంటే, దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించే ధైర్యం చేస్తారా..?.." అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదేశారు. అయితే సదరు ఎమ్మెల్యే వాదన మాత్రం మరోలా ఉంది. పేద కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఎదగిన తనను అప్రతిష్టపాలు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆ డబ్బుతో తనకేం సంబంధం లేదని సదరు ప్రజా ప్రతినిధి.. "విమానం, బంగ్లాతో కనిపిస్తే అవి తనవేనా?.." అంటూ గట్టి ప్రశ్నే సంధించారు. అలా అని ఈయనే ఒక్కరే అనుకునేరు. ఇలాంటి వారు కోకొల్లలు.