అయోధ్యకు ఉచిత రైలు ప్రయాణం

అయోధ్యకు ఉచిత రైలు ప్రయాణం

రాయ్ పుర్ :  జనవరి 22న అయోధ్య  శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరగునున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీరాముడిని దర్శించుకోవాలనుకునే వారి కోసం వార్షిక ఉచిత రైలు ప్రయాణ పథకాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌సాయి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

  ఉచిత రైలు నిర్ణయం ప్రధానమంత్రి మరొక హామీని నెరవేరుస్తుందని ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌సాయి అన్నారు. ఈ రైలు సహాయంతో 20,000 మందికి పైగా భక్తులు అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకోగలుగుతారని తెలిపారు. 18 నుండి 75 సంవత్సరాల వయస్సు గల వారు వైద్యపరంగా ఫిట్‌గా ఉన్నవారు ఈ పథకానికి అర్హులని ముఖ్యమంత్రి తెలిపారు.