
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో నక్సల్స్, పోలీసుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. దంతెవాడ లోని కాటేకల్యాన్ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (District Reserve Guard) బృందం మంగళవారం కూంబింగ్ నిర్వహించింది. ఈ కూంబింగ్ లో నక్సల్స్ జాడ తెలుసుకున్న పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారని పోలీసులు తెలిపారు.