మధ్యప్రదేశ్‌ లో చికెన్‌ పార్లర్లు ప్రారంభం

మధ్యప్రదేశ్‌ లో చికెన్‌ పార్లర్లు ప్రారంభం

నాన్ వెజ్ షాపులనుంచి ప్రజలు నాణ్యమైన చికెన్, మటన్ కొనుగోలు చేస్తారు. అయితే ఈ షాపులను ఎవరైనా నిర్వహించుకోవచ్చు. కొన్ని హోల్ సేల్ షాపులకు తప్ప చిన్న,చిన్న షాపుల కు ఎలాంటి పర్మిషన్లు అవసరం లేదు. దీంతో కొన్ని షాపుల్లో నాణ్యత లేని నాన్ వెజ్ అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారు. దీంతో కొనుగోలు చేసిన వారు అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం  స్వయంగా రాష్టంలో చికన్‌ పార్లర్లను ప్రారంభించింది. ఈ చికెన్‌ పార్లర్లలో నాణ్యత కలిగిన గుడ్లు, పాలు లభ్యమవుతాయని తెలిపారు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి లఖన్‌ సింగ్‌. అంతేకాదు ఈ పార్లర్లలో కడక్‌నాథ్‌ చికన్‌ను కూడా అమ్మనున్నట్లు చెప్పారు.