మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.వారాంతంలో చికెన్ ముక్కలు తింటూ కుటుంబంతో సరదాగా గడిపే సామాన్య నగర వాసులను చికెన్ ధరలు షాకిచ్చాయి. ఇన్నాళ్లు నాలుగు ముక్కలు నోట్లు వేసుకున్న వారు.. ఇకపై రెండు మక్కలతో సర్దు కోవాల్సిందే. ఎందుకంటే.. చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. చికెన్ ధరలు కొండెక్కి కూర్చోవడంతో.. సామాన్యులు చికెన్ కొనాలంటే కాస్తా ఆలోచించాల్సిందే. ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం చికెన్ ధరలు ఏకంగా రూ.100లు పెరిగాయి. తాజా పెంపుతో తెలంగాణలో చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కేజీ చికెన్ ధర ఏకంగా రూ.300కు చేరింది. రూ.200గా ఉన్న కిలో చికెన్ ధర రూ.300కు పెరగడంతో మాంసం ప్రియులు నోరెళ్లబెడుతున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత పెరగడంతోనే.. చికెన్ ధరలు పెరగటానికి కారణంగా చెబుతున్నారు వ్యాపారస్తులు. గత రెండు నెలల నుంచి రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిమి కారణంగా ఫ్రౌల్టీలలోని కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ క్రమంలో కోళ్ల ఉత్పత్తి భారీగా తగ్గిపోవడంతో మార్కెట్ లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. రానున్న రోజుల్లో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు వ్యాపారులు.