భగ్గుమంటున్న చికెన్ ధరలు.. కిలో స్కిన్లెస్ 350.. కిలో కొనేందుకు వెళ్లి అరకిలోతో సర్దిపెట్టుకుంటున్న వైనం

భగ్గుమంటున్న చికెన్ ధరలు.. కిలో స్కిన్లెస్ 350.. కిలో కొనేందుకు వెళ్లి అరకిలోతో సర్దిపెట్టుకుంటున్న వైనం
  • దాణా, మందుల రేట్ల ఎఫెక్ట్​అంటున్న పౌల్ట్రీ రైతులు
     
  • భారీగా పెరిగిన ప్రొడక్షన్ కాస్ట్..ఎండాకాలంలో 
  • తగ్గిన కోళ్ల పెంపకం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో చికెన్‌‌ధరలు భగ్గుమంటున్నాయి. ఆదివారం రోజున  కిలో స్కిన్‌‌లెస్ చికెన్ రూ.350- నుంచి 360 వరకు, బోన్‌‌లెస్ చికెన్ రూ.640 వరకు అమ్ముడైంది. సాధారణంగా వానాకాలంలో తగ్గే చికెన్ ధరలు ఈసారి మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. 

కోళ్ల దాణా, మందులు, కోడిపిల్లల ధరలు పెరగడంతో పాటు ఫారాల్లో ఉత్పత్తి తగ్గడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. గత ఎండాకాలంలో రూ.300వరకు ఉన్న చికెన్ ధరలు వర్షాలు పడ్డాక తగ్గుతాయని భావించగా నేడు పరిస్థతి మాత్రం భిన్నంగా మారింది.

  దాణా ధరలే ప్రధాన కారణం..

పౌల్ట్రీ దాణాలో వాడే మక్కలు, సోయా, నూకలు, తౌడు ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగింది.  గత మేలో క్వింటాలు రూ.1,950 ఉన్న మక్కలు ప్రస్తుతం రూ.2,400- నుంచి 2,500కు చేరాయి. సోయా ధర రూ.3,200 నుంచి రూ.6,200కు పెరిగింది. నూకలు రూ.1,600 నుంచి రూ.2,200కు, తౌడు రూ.1,500 నుంచి రూ.2,000కు పెరిగింది. 

ఇలా గత రెండు నెలల క్రితం టన్నుకు రూ.21వేల నుంచి రూ.27వేలకు పెరిగింది.  పౌల్ట్రీ వర్గాలు కోళ్ల పెంపకానికి వినియోగించే మెడిసిన్స్​ వాడితే ఎన్​సీబీ, అమినా యాసిడ్ వంటి మెడిసిన్స్ ఎక్స్​పోర్ట్స్ గణనీయంగా తగ్గి పోయాయి. దీంతో రూ.250, నుంచి రూ.600 మెడిసిన్​ ధరలు పెరిగింది. షిప్​మెట్స్​ తగ్గగంతో దీంతో ఒక టన్ను ఉత్పత్తి కోసం వినియోగించే మెడిసిన్స్ రూ.2000 నుంచి రూ.3000పెరిగింది. అదే విధంగా దాణా, మందులతో పాటు,  విద్యుత్, నిర్వహణ ఖర్చులు పెరిగాయి.  దీంతో చికెన్​ ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని పౌల్ట్రీ రైతులు పేర్కొంటున్నారు.

వారంలోనే పెరిగిన ధరలు

ఆదివారం స్కిన్‌‌లెస్‌‌ చికెన్‌‌ ధరలు కిలో రూ.360 వరకు అమ్మగా లైవ్‌‌బర్డ్‌‌కిలో రూ.220 వరకు విక్రయించారు. ఇక బోన్‌‌లెస్‌‌ చికెన్‌‌ రూ.640 వరకు ధరలు పలకడం గమనార్హం గడిచిన వారం రోజుల్లో రూ.300 నుంచి రూ. 320  మధ్య ఉండగా నుంచి ఏకంగా రూ.350కి పెరిగింది. 

బోన్​లెస్​ రూ.550 నుంచి రూ.640కి పెరిగింది. వారం రోజుల్లో పెరిగి ఆదివారం నాటికి రూ. 350 దాటిందని  మార్కెట్‌‌వర్గాలు చెబుతున్నాయి.  కోళ్ల దాణా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఆసరాగా చేసుకుని నిరుడు వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి పౌల్ట్రీ వర్గాలు ధరలు పెంచుతున్నట్లు సమాచారం. 

తగ్గిన చికెన్‌‌ ప్రొడక్షన్‌‌

గత వేసవిలో ఎండలు గణనీయంగా పెరడంతో కోడి చిక్స్‌‌ఎదగడానికి 45 నుంచి 60 రోజుల వరకు పడుతోందని,  అందుకే బ్రాయిలర్‌‌కోళ్ల ప్రొడక్షన్‌‌ తగ్గుతోందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నారు.  సమ్మర్​ ఎక్కువ వేడి ఉండడంతో చిక్స్​ బతకడం లేదు. 

వైరస్​ బాగా ఎక్కువగా ఉండడంతో పేరెంట్​ బర్డ్​ బతకడం లేదని ఇలాంటి ఇబ్బందిలతో కొందరు పౌల్ట్రీ రైతులు ఫారాల్లో కోళ్లను పెంపకాన్ని భారీగా తగ్గించారు. గత కొన్ని రోజులుగా ప్రొడక్షన్‌‌ పడిపోయి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.  గతంలో కోడిపిల్లలు (చిక్​ ) జనరల్ గా  28 రూ.30 ఉండేది. నేడు చిక్స్​ ధరలు ఒక్కోటి రూ.52 వరకు పలుకుతున్నాయి.  కాస్ట్​ ఆఫ్​ ప్రొడక్షన్​ గణనీయంగా పెరిగింది.