‘మంజుమ్మెల్ బాయ్స్’ దర్శకుడి సినిమా ‘బాలన్’ రిలీజ్‌‌కు రెడీ

‘మంజుమ్మెల్ బాయ్స్’ దర్శకుడి సినిమా ‘బాలన్’ రిలీజ్‌‌కు రెడీ

భారీ చిత్రాలు నిర్మించే కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ కలిసి  నిర్మిస్తున్న సినిమా ‘బాలన్ - ది బాయ్’. ఈ చిత్రానికి ‘ఆవేశం’ ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో ‘మంజుమ్మెల్ బాయ్స్’ దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకోగా, ఆదివారం మదర్స్ డే సందర్భంగా రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేశారు.

జూన్ 19న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  ఓ పిల్లాడు తన తల్లి చేయి పట్టుకున్న ఈ అనౌన్స్‌‌మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.  ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు గొప్ప అనుభూతికి లోనవుతారని డైరెక్టర్ చిదంబరం అన్నాడు.  ప్రతి ఒక్కరూ చర్చించుకునేలా తమ సినిమా ఉంటుందని నిర్మాత వెంకట్ కె నారాయణ అన్నారు.