చిదంబరం రాజీనామా

చిదంబరం రాజీనామా

కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ హోంమంత్రి పి.చిదంబరం తన సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎన్నికైనందున మహారాష్ట్రలోని తన రాజ్యసభ స్థానానికి గురువారం రాజీనామా చేశారు. “తమిళనాడు రాష్ట్రం నుండి నేను రాజ్యసభకు ఎన్నికైనందున.. మహారాష్ట్ర నుండి నా స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది" అని చిదంబరం ట్వీట్ చేశారు. రాజ్యసభ ఛైర్మన్ తన రాజీనామాను ఆమోదించినట్టుగా చిదంబరం మరో ట్వీట్ లో తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నంచి రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించడం తనకి ఎంతో గౌరవంగా ఉందని చిదంబరం పేర్కొన్నారు. 2016లో మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నికైన చిదంబరం పదవీ కాలం ఈ ఏడాది జూలై 4తో ముగియనుంది. కాగా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి చిదంబరం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.