నీ లేఖ.. హృదయాన్ని తాకింది

నీ లేఖ.. హృదయాన్ని తాకింది

న్యూఢిల్లీ, వెలుగు: కేరళకు చెందిన ఐదో తరగతి విద్యార్థిని లిడ్వినా జోసెఫ్ రాసిన లేఖకు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మంగళవారం రిప్లై ఇచ్చారు. ఆ చిన్నారి రాసిన లేఖను, గీసిన చిత్రాన్ని చీఫ్ జస్టిస్ ఆఫీస్ మీడియాకు విడుదల చేసింది. విద్యార్థినికి రాసిన రిప్లైలో  ‘నువ్వు రాసిన అందమైన లేఖ, జడ్జిల పనితీరుపై హృదయానికి హత్తుకునేలా గీసిన డ్రాయింగ్ అందుకున్నాను. దేశంలో జరుగుతున్న పరిణామాలను నువ్వు గమనిస్తున్న తీరు, ప్రజల బాగోగులపై నీ తపన నన్ను చాలా ఆకట్టుకుంది. దేశ నిర్మాణంలో నువ్వు మంచి పౌరురాలిగా ఎదుగుతావు’’ అని జస్టిస్ ఎన్వీ రమణ  అభినందించారు. కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఎంతో మంది ప్రాణాలు కాపాడిందంటూ లిడ్వినా.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి కిందటి నెలలో లేఖ రాసింది.