
తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కార్ దివాళ తీయించిందన్నారు సీఎం రేవంత్రెడ్డి. బుధవారం (డిసెంబర్ 20) రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు.
బీఆర్ ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని.. ఇంకా అబద్దాలతో సభను తప్పు దోవ పట్టించాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దుర్వినియోగం చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. అబద్ధాలతో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని చెప్పారు. ఇప్పుడేమో సత్య హరిశ్చంద్రులా మాట్లాడుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ సృష్టించిన సందపను తనఖా పెట్టి బీఆర్ ఎస్ ప్రభుత్వం అప్పులు తెచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కూడబెట్టిన రూ. 4వేల 972 కోట్ల విద్యుత్ శాఖ ఆస్తులను బీఆర్ ఎస్ ప్రభుత్వం తనఖా పెట్టిందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో రూ. 13 లక్షల 72 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇంత ఖర్చు చేసినా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదు.. దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదన్నారు రేవంత్ రెడ్డి. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వలేదు.. రాజీవ్ ఆరోగ్య శ్రీకి నిధులు విడుదల చేయని దుస్థితి ఉందన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఇవ్వలేదు.. సెక్రటేరియట్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి నెలా మొదటి తారీఖున రావాల్సి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వలేదని.. పెద్ద కొడుకును అని చెప్పు్కున్న పెద్దమనిషి ఆసరా పెన్షన్లు ఇవ్వని పరిస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఎన్నికలకు నాలుగు నెలల ముందే వైన్స్ టెండర్లు వేసి బీఆర్ ఎస్ ప్రభుత్వం ఉన్నదంతా దోచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి బీఆర్ ఎస్ నెరవేర్చలేదన్నారు. లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు.. ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి కట్టిస్తామన్నారు. ఏఒక్కటి నెరవేర్చలేదని అన్నారు రేవంత్ రెడ్డి.
నిజాలు చెబితే పరువు పోతుంది.. కానీ ఊరుుకంటే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని.. అందుకే వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.