- ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో కొత్తగా నిర్మిస్తున్న ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ పనులను డిసెంబర్ లోగాపూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లుగా ఆర్అండ్బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ తెలిపారు. బుధవారం ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ, ఆర్అండ్బీ ఇంజినీర్లతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. వికాస్ రాజ్మాట్లాడుతూ.. ప్రధాన ఆస్పత్రి భవనం, అనుబంధ నిర్మాణాల పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇప్పటికే ఫౌండేషన్ పనులు పూర్తి దశకు చేరుకోగా ప్రస్తుతం బేస్‌మెంట్ రూఫ్ స్లాబ్‌ల నిర్మాణం కొనసాగుతోందని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ సంస్థ మేలో చేపట్టే రోజువారీ పనుల వివరాలను తనకు సమర్పించాలని ఆదేశించారు. 11 కేవీ విద్యుత్ లైన్ల మార్పిడి మే 20లోపు పూర్తి చేయాలన్నారు. నాళా భూసేకరణ పనులను జీహెచ్ఎంసీ ఆఫీసర్లు జూన్‌లోపు కంప్లీట్ చేయాలని ఆదేశించారు.

