ప్రవల్లిక సూసైడ్  కేసులో చిక్కడపల్లి సీఐ సస్పెన్షన్

ప్రవల్లిక సూసైడ్  కేసులో చిక్కడపల్లి సీఐ సస్పెన్షన్
  • ప్రవల్లిక సూసైడ్  కేసులో చిక్కడపల్లి సీఐ సస్పెన్షన్

ముషీరాబాద్, వెలుగు : వరంగల్ కు చెందిన విద్యార్థి మర్రి ప్రవల్లిక  ఆత్మహత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో చిక్కడపల్లి సీఐ పిడమర్తి నరేశ్​ను  సస్పెండ్  చేశారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్  అవుతున్న  ప్రవల్లిక  .. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో తాను అంటున్న గర్ల్స్ హాస్టల్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆ హాస్టల్ కు చేరుకుని ఆందోళన చేశారు.

పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయడంతోనే  ప్రవల్లిక  ఆత్మహత్య చేసుకుందని వారు ఆరోపించారు. ఈ ఘటనలో శాంతిభద్రతలను కాపాడడంలో చిక్కడపల్లి సీఐ నరేశ్  నిర్లక్ష్యంగా వ్యవహరించారని హైదరాబాద్  పోలీస్  కమిషనర్  సందీప్  శాండిల్య  ఆదివారం ఆయనకు ఉత్తర్వులు జారీ చేశారు.