
హైదరాబాద్, వెలుగు: ధర్మరక్షణ సమితి ఫౌండర్ చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. ప్రవీణ్‌కు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగలేదతి కేటీఆర్ చెప్పారని, అయితే ఆయనకు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారో చెప్పాలన్నారు. కేటీఆర్ సీఎం కావడం కోసం కేసీఆర్ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. కేటీఆర్ సీఎం అయ్యేందుకు కేసీఆర్‌ను ఏం చేస్తారేమోననే భయం తమకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, బీజేపీ సిటీ అధ్యక్షుడు గౌతం రావు తదితరులు పాల్గొన్నారు.