
నిజామాబాద్: పాపను కిడ్నాప్ చేసిన వ్యక్తిని దేహశుద్ది చేశారు స్థానికులు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో మంగళవారం జరిగింది. నవీపేట్ మండలం దండిగుట్టకు చెందిన లక్ష్మి అనే మహిళ తన సంవత్సరంన్నర పాపతో నిజామాబాద్ వచ్చింది. ఒంటరిగా ఉన్న లక్ష్మిని చూసిన ఓ వ్యక్తి…ఆమెతో మాటలు కలిపి, పాపకు పాలు తాగిపిస్తానని ఎత్తికెళ్లినట్లు మహిళ వాపోయింది. నిందితుడు నిర్మల్ జిల్లా బాసరకు చెందిన నాగరాజ్ గా గుర్తించారు.
పాపను ఎత్తుకుని పారిపోయిన నాగరాజును మహిళ బంధువులు మంగళవారం నిజామాబాద్ ఎంపీడీవో కార్యాలయం వద్ద పట్టుకున్నారు. పాప ఆచూకీ చెప్పాలంటూ చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.