సిటీ పోలీసుల కోసం శిశు సంరక్షణ కేంద్రం ... పేట్ల బుర్జులో ప్రారంభించిన సీపీ ఆనంద్

సిటీ పోలీసుల కోసం శిశు సంరక్షణ కేంద్రం  ...  పేట్ల బుర్జులో ప్రారంభించిన సీపీ ఆనంద్

హైదరాబాద్​సిటీ, వెలుగ: పేట్లబుర్జులోని సిటీ ఆర్ముడ్​రిజర్వ్​ఆఫీసులో పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లల కోసం ఏర్పాటు చేసిన శిశు సంరక్షణా కేంద్రం (క్రెష్)ను సిటీ సీపీ సీవీ ఆనంద్ బుధవారం ప్రారంభించారు. పోలీస్​డ్యూటీలు, బందోబస్తుల కారణంగా ఎక్కువ టైమ్ ఫీల్డ్​లో ఉండే మహిళా అధికారులు, సిబ్బందికి ఈ శిశు సంరక్షణ కేంద్రం బాగా ఉపయోగపడుతుందన్నారు. ఇందులో సిటీ పోలీస్​శాఖకు చెందిన ఎవరైనా ఆడ, మగా తేడా లేకుండా పిల్లలను చేర్పించవచ్చన్నారు.

 ఇండోర్, అవుట్‌‌‌‌‌‌‌‌ డోర్ ప్లే ఏరియాలు, ఊయలలు, ఫీడింగ్ రూమ్స్, మెడికల్ రూమ్స్​, గర్భిణుల కోసం డార్మిటరీ ఉన్నాయన్నారు. ఐదేండ్ల వయస్సున్న 150- నుంచి 200 మంది పిల్లలకు వసతి సౌకర్యం ఉంటుందన్నారు. పిల్లలకు ఆహారం అందించడానికి స్పెషల్​కిచెన్​ఉందని, ట్రైనింగ్​పొందిన ఎక్స్​పర్ట్స్​పిల్లలను చూసుకుంటారన్నారు. బిల్డింగ్​నిర్మాణానికి సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేశామన్నారు.

 ఈ ప్రాజెక్టును మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సీఎస్ఆర్​లో భాగంగా చేపట్టారన్నారు. అడిషనల్​సీపీ విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్​జాయింట్​సీపీ జోయల్ డెవిస్, సౌత్​ఈస్ట్​జోన్​డీసీపీ  చైతన్య కుమార్, మెఘా ఇంజినీరింగ్ నుంచి పామిరెడ్డి మంజులా రెడ్డి, పామిరెడ్డి మెఘా రెడ్డి, మురళీ మెఘా పాల్గొన్నారు.