
పట్టుకొని కొట్టిన గ్రామస్తులు.. పోలీసులకు అప్పగింత
స్కూల్లో ఆడుకుంటున్న పిల్లలకు చాక్లెట్ల ఆశ చూపి కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఇద్దరు దుండగులను పట్టుకొని స్థానికులు చితకబాదారు. తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం మాసాన్ పల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన అర్చన(1వ తరగతి), అవంతి(2వ తరగతి) ప్రైమరీ స్కూల్‌లో మధ్యాహ్నం ఆడుకుంటున్నారు. అటుగా వచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన సందీప్, జగదీశ్ చాక్లెట్లు ఇస్తామని పిల్లల్ని పిలిచారు. వారు రాగానే ఎత్తుకుని పరుగెత్తారు. పిల్లలు ఏడ్వటంతో అక్కడున్నవారు కిడ్నాపర్లను పట్టుకున్నారు.