
హైదరాబాద్,వెలుగు: రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా చిన్నారులకు సైతం ట్రాఫిక్ రూల్స్ గురించి తెలిసుండాలని అడిషనల్ సీపీ, ట్రాఫిక్ ఏవీ రంగనాథ్ సూచించారు. గోషా మహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో రోడ్ సేఫ్టీ సమ్మర్ క్యాంప్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. 6 రోజుల పాటు ఈ క్యాంప్ ఉంటుందన్నారు. పేరెంట్స్ తమ పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పాలన్నారు. స్కూల్స్ ప్రారంభమైన తర్వాత స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తామన్నారు.