చిల్డ్రన్స్ డే వచ్చేసింది. ప్రతి ఏడాది నవంబర్ 14న మనం చిల్డ్రన్స్ డేని జరుపుకుంటుంటాం... అయితే ఈ రోజున ప్రతి స్కూల్లో చిన్నారుల అట, పాటలతో సందడిగా ఉంటుంది. కానీ పిల్లలకు డబ్బులు ఎలా వాడాలన్నది చిన్నప్పట్నుంచే పిల్లలకు నేర్పించాలి. దీనికి ఎంత ఖర్చు పెట్టాలి. నోటు విలువ ఎంత, మన ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇలాంటివి పిల్లలకు నేర్పాలి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఎలా ఉండాలన్నది చెప్పాలి. మనీ మేనేజ్ మెంట్ అన్నది జీవితంలో ఎంత ముఖ్యమో ఏ పెద్ద వస్తువు కొన్నా చెప్పాలి. డబ్బు పొదుపు చేయడం, దాన్ని అవసరానికి వాడటం నేర్పించాలి.
రాత్రిత్వరగా పడుకోవడం, స్నానం చేయడం. బట్టలు వేసుకోవడం, చిన్న చిన్న బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ వాళ్లంతట వాళ్లే తయారు చేసుకోవడం, వస్తువులను సరిగ్గా సర్దిపెట్టడం, ఇంటిని శుభ్రం చేసుకోవడం ఇలాంటి విషయాలన్నీ పిల్లలకు చిన్నప్పుడే వచ్చేయాలి. ఇది వాళ్ల జీవితంలో ఒక రొటీన్ గా మారిపోవాలి. ఇలాంటివి మరచిపోకుండా ఉండేందుకు బొమ్మలతో ప్రత్యేకంగా ఒక చార్జ్ తయారుచేసి పెట్టండి. చిన్నప్పుడే ఇవి నేర్చుకుంటే పెద్దయ్యాక కూడా ఈ అలవాట్లను మార్చుకోరు. జీవితాంతం ఈ అలవాట్లు వాళ్లను అంటిపెట్టుకొనే ఉంటాయి.
పద్ధతి చాల ముఖ్యం... చిన్నప్పట్నుంచే పిల్లలకు ఒక పద్ధతి నేర్పించాలి. పెద్దవాళ్లతో, సాటి వ్యక్తులతో ఎలా ఉండాలన్నది చెప్పాలి. నోటి నుంచి ఒక మాట బయటకు వస్తుందంటే దానికి ముందు ఎంతో ఆలోచించాలన్నది నేర్పాలి. ఎదుటివ్యక్తికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యతను గుర్తుచేయాలి. ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును ఒప్పుకొని, సరిదిద్దుకునే ఆలోచన చిన్నప్పట్నుంచే ఉండాలి. ఎవరైనా సహాయం చేస్తే 'థ్యాంక్స్ చెప్పడం, ఎవరైనా సహాయం కోసం ఎదురుచూస్తుంటే వెళ్లి చేయడం పిల్లలకు రావాలి. ఇవన్నీ తల్లిదం డ్రులే వాళ్లకు నేర్పాలి. మన నెహ్రూ చెప్పినట్టు వీళ్లే భావిభారత పౌరులు. వీళ్లకు ఇవన్నీ ఇప్పుడే నేర్పిస్తే దేశ భవిష్యత్తు మంచివాళ్ల చేతుల్లోనే ఉన్నట్లు!
