హైదరాబాద్సిటీ, వెలుగు: మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్బంగా ‘బాలల ప్రజావాణి’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే పిల్లలను వివిధ రంగాల్లో ప్రోత్సాహించాలన్నారు.
పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రజావాణిని నిర్వహించడం గొప్ప విషయమన్నారు. చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, యూనిసెఫ్ సౌత్ ఇండియా చీఫ్ జలేలం తఫెసి, చైల్డ్ రైట్స్ సంస్థ అధికారి రమేష్ పాల్గొన్నారు.
