'తెగింపు' నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది

'తెగింపు' నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది

తమిళ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'తునీవు'. హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఈ నెల 12వ తేదీన రిలీజ్ కానుంది. అయితే తమిళతో పాటు తెలుగులో అదే రోజున 'తెగింపు' టైటిల్ తో విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం ఈ మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి 'ఛిలా ఛిలా ఛిల్లా' అంటూ సాగే ఒక తెలుగు లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 

ఈ మీడియోను చూస్తుంటే.. పక్కా మాస్ సాంగ్ అనిపిస్తోంది. అజిత్ సరసన మంజూ వారియర్ హీరోయిన్ గా నటించింది. జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. సముద్రఖని,అజయ్,చిరాగ్ జాని ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ యాక్షన్ సినిమా ప్రేమికులను ఆకట్టుకునేలా ఉంది.