
చైనా మిలిటరీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్ని భారీగా పెంచింది. పోయిన ఏడాదితో పోల్చితే 7.1 శాతం నిధుల్ని పెంచి 230 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.17.5 లక్షల కోట్లు కేటాయించింది. భారత రక్షణ బడ్జెట్‌తో పోల్చితే చైనా బడ్జెట్ దాదాపు మూడింతలు ఎక్కువ. ఈ విషయాన్ని అక్కడి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ)లో ప్రీమియర్ లీ కెఖియాంగ్ రక్షణ బడ్జెట్ ప్రతిపాదనల్ని ప్రవేశపట్టారు.
బడ్జెట్ సమావేశంలో లీ.. ‘సరిహద్దు రక్షణ, సరిహద్దు సముద్రజలాలపై హక్కుల పరిరక్షణ, కోవిడ్ సంక్షోభం లాంటివాటిని విజయవంతంగా ఎదుర్కొన్నాం. ఆర్మీ శతాబ్ది ఉత్సవాల నాటికి పెట్టుకున్న లక్ష్యాలను పూర్తిచేసేలా సైనిక చర్యలను చేపట్టాల’ని ఆర్మీని, పరోక్షంగా తూర్పు లద్దాఖ్‌ను ఉద్దేశించి ప్రస్తావించారు. దక్షిణ, తూర్పు సముద్ర జల్లాలపై పూర్తి హక్కులు తమవేనంటూ వాదిస్తూ చైనా పొరుగు దేశాలతో ఘర్షణలకు దిగుతోంది. వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, తైవాన్, జపాన్ దేశాలతో చైనా తరచూ తగవులకు దిగుతోంది.