కీటకాల కణాలతో తయారు చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ ను మనుషులపై ప్రయోగించేందుకు చైనా ఆమోదం తెలిపింది. హ్యూమన్స్ పై ప్రయోగాన్ని చైనా ఆమోదించినట్లు చెంగ్డు ప్రభుత్వం తెలిపింది.
చెంగ్డూలోని సిచువాన్ యూనివర్సిటీకి చెందిన వెస్ట్ చైనా హాస్పిటల్ తయారు చేసిన వ్యాక్సిన్ ను మనుషులపై ప్రయోగించేందుకు నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ నుండి అనుమతి లభించినట్లు చెంగ్డూ ప్రభుత్వం వెల్లడించింది.
కీటకకాలతో తయారు చేసిన వ్యాక్సిన్ తొలత కోతులపై ప్రయోగించినప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, అందుకే ఈ వ్యాక్సిన్ కు హ్యూమన్ ట్రయల్స్ అంగీకరించినట్లు సమాచారం.
