
కట్నం అంటే అమ్మాయిలు అబ్బాయిలకు ఇచ్చేది.. చైనా రివర్స్ నడుస్తుంది.. అదే కన్యాశుల్కం. అబ్బాయిలు అమ్మాయిలకు ఇస్తున్నారు. జనాభా పెరుగుదల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేసింది చైనా సర్కార్. 20 ఏళ్లుగా ఒకరు మాత్రమే అని స్పష్టం చేస్తుంది. ఈ క్రమంలోనే అబ్బాయే కావాలి.. అబ్బాయే పుట్టాలి అనే బలమైన ఆలోచనలోకి వచ్చేశారు చైనీయులు. దీంతో 15 ఏళ్లుగా అమ్మాయిల సంఖ్య దారుణంగా పడిపోయింది. వంద మంది అబ్బాయిలు అంటే.. అమ్మాయిలు 75 మంది అమ్మాయిల రేషియోకు వచ్చేసింది.
ఈ సమయంలోనే దేశంలో యువత తగ్గిపోయి.. వృద్ధుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. రాబోయే సంవత్సరాల్లో వృద్ధ చైనా అవుతుందని భయపడిన చైనా ప్రభుత్వం.. నిబంధనలు అన్నింటినీ సడలించింది. పిల్లల్ని కనాలంటూ ప్రకటనలు ఇస్తుంది. ఇద్దరు కాదు.. నలుగురిని అయినా కనండి అంటూ ఆఫర్స్ ఇస్తుంది. వైద్య ఖర్చులు ఉచితం అని ప్రకటించింది. పన్ను రాయితీలు ప్రకటించింది. అయినా సరే ఎవరూ ముందుకు రావటం లేదు.. దీనికి కారణం ఏంటో తెలుసా..
కన్యాశుల్కం.. అబ్బాయిలు అమ్మాయిలకు కట్నం ఇచ్చే సంప్రదాయం పీక్ స్టేజ్ కు వెళ్లింది. అమ్మాయిని ఇవ్వాలంటే మంచి ఉద్యోగం ఉంటే సరిపోదు.. సొంత ఇల్లు ఉండాలి.. బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి.. పొలం ఉండాలి.. బాగా ఆస్తి ఉండాలి అనే కండీషన్స్ అమ్మాయి పేరంట్స్ పెడుతున్నారు. అంతే కాకుండా పెళ్లి సమయంలో కనీసంలో కనీసం 10 లక్షల రూపాయల అయినా కట్నం ఇవ్వాలనే కండీషన్ పెడుతున్నారు అమ్మాయి పేరంట్స్.. ఇన్ని ఉంటే పెళ్లెందుకు చేసుకోవటం అంటూ బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు చైనా యువత. అమ్మాయిల కోరికలను తీర్చలేం.. వాళ్లడిగి కట్నాలు ఇవ్వలేం అంటూ పెళ్లిళ్లు చేసుకోవటం లేదు. దీంతో ప్రభుత్వం కల్యాశుల్కం విధానాన్ని రద్దు చేసింది. ఇది అదికారికంగా చేసిందే కానీ.. వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. అమ్మాయిల తల్లి దండ్రుల కోరికలను తీర్చలేక.. సోలో బతుకే సో బెటర్ అంటూ ముందుకు సాగుతున్నారు చైనా యువత.
కట్నం తీసుకోకుండా అమ్మాయిల పెళ్లి చేస్తున్న అత్తలకు ధన్యవాదాలు చెబుతున్నారు స్థానిక అధికారులు. అందమైన అత్త.. మనసున్న అత్త అంటూ పెళ్లి వేడుకల్లో ప్లెక్సీలు కడుతున్నారు.. సమాజంలో ఉత్తమమైన అత్త అంటూ ప్రచారం చేస్తున్నారంట. హెల్తీ మ్యారేజీస్ పేరుతో ప్రభుత్వమే ఇలాంటి ప్రచారం చేయటం ద్వారా కనీసం కొంత మంది అయినా మారతారనే ఉద్దేశంలో ఉంది అక్కడి ప్రభుత్వం. దీనికి కారణం.. దేశ జనాబా పెంచటమే.. లేకపోతే మరో 20 ఏళ్లలో వృద్ధ చైనాగా మారిపోనుంది ఆ దేశం..