చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా కొత్త వేరియంట్లు

చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా కొత్త వేరియంట్లు

కరోనా పుట్టినిల్లుగా భావించే చైనాలో మరోసారి లాక్ డౌన్ అన్న పదం మారు మోగుతోంది. గతంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు అదే తరహాలో మళ్లీ కొత్త వేరియంట్లు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. ఒమిక్రాన్ కు చెందిన బీఎఫ్ 7, బీఎఫ్ 5.1.7 వేరియంట్ల కేసులు ఆ దేశంలో అధికంగా నమోదైతున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ కొత్త వేరియంట్లు ఊహించని రీతిలో వ్యాపిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. BA.5.1.7 ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్‌ను మొద‌టిసారి ఈశాన్య చైనా ప్రాంతంలో గుర్తించామ‌న్న అధికారులు... షాన్‌డాంగ్ ప్రావిన్సులో అక్టోబ‌ర్ 4వ తేదీ నుంచి BF.7 వేరియంట్ కేసుల ఉధృతి మరింత ఎక్కువైనట్టు వెల్లడించారు. BF.7 స‌బ్ వేరియంట్ ప‌ట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతకు మునుపే హెచ్చరించింది. రానున్న రోజుల్లో BF.7 స‌బ్ వేరియంట్.. డామినెంట్ వేరియంట్‌గా మార‌నున్నట్లు చైనా శాస్త్రవేత్తలు అంచ‌నా వేస్తున్నారు.