భారత్ - పాక్ యుద్ధంపై చైనా రియాక్షన్ ఇదే..

భారత్ - పాక్ యుద్ధంపై  చైనా రియాక్షన్ ఇదే..

భారత్ పాకిస్తాన్ యుద్దంపై చైనా స్పందించింది. ఇరుదేశాల మధ్య పరిణామాలతో ఆందోళనగా ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్   తెలిపారు.  టెర్రరిజానికి తాము వ్యతిరేకమని అన్నారు. పొరుగు దేశాల్లో శాంతి, సుస్థిరత అవసరమని చెప్పారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. భారత్ ,పాకిస్తాన్ అంతర్జాతీయ చట్టాలను పాటించాలని సూచించారు. ఇరు దేశాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

ఇండియా  చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో పాక్ కాల్పులు జరుపుతోంది. డ్రోన్లు,మిసైళ్లతో దాడుల చేస్తోంది.  అంతే ధీటుగా 50 కి పైగా పాక్ డ్రోన్లను ఇండియా ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ను దెబ్బకొడుతోంది. పాక్ దాడులకు భారత్ ధీటుగా బదులిస్తోంది. 

Also Read:-భారత్ మాటవినని ఎక్స్.. @Global Affairs ఖాతా నిలిపివేత, ఏమైందంటే..?

అటు అమెరికా కూడా భారత్,పాకిస్తాన్ యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదని  అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్  వ్యాఖ్యలు చేశారు. భారత్ ,పాకిస్తాన్ మధ్య తాము జోక్యం చేసుకోబోమన్నారు.  జరుగుతున్న పరిణామాలకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితులు తగ్గాలని అమెరికా  కోరుకుంటుందన్నారు.