యాక్షన్‌‌‌‌ ఏమీ లేని జేమ్స్‌‌‌‌ బాండ్‌‌‌‌ స్టోరీ

యాక్షన్‌‌‌‌ ఏమీ లేని జేమ్స్‌‌‌‌ బాండ్‌‌‌‌ స్టోరీ

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా రూపొందుతున్న చిత్రం ‘చైనా పీస్‌‌‌‌’. యూనిక్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌తో స్పై డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. మూన్ లైట్ డ్రీమ్స్ సంస్థ నిర్మిస్తోంది.  తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఇదేంటో జేమ్స్‌‌‌‌ బాండ్‌‌‌‌’ అనే పాటను విడుదల చేశారు.  కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ ఎనర్జిటిక్‌‌‌‌ సాంగ్‌‌‌‌ను కంపోజ్ చేయగా స్ఫూర్తి జితేందర్, హారిక నారాయణ్ పాడారు. 

 ‘‘ఇదేంటో జేమ్స్‌‌‌‌ బాండ్‌‌‌‌ గారి స్టోరీలో అదేంటో యాక్షన్‌‌‌‌ ఏమీ లేనే లేదురో.. భారీ అంచనాల ఇంచుమించులో ఊహించింది ఏది కూడా లేదురో.. గూఢచారి, సుదూర బాటసారి.. ఓపికేగా సరైన దారి..” అంటూ దినేష్ కాకర్ల రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి.  

హర్షిత బండ్కమూరి, కమల్ కామరాజు, గులాసీ, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.