
చైనాలోని గ్వాంగ్జౌకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ జాంగ్ కిఫెంగ్ నేతృత్వంలో కైవా టెక్నాలజీ నూతన ప్రయోగాన్ని ప్రకటించింది. రానున్న రోజుల్లో రోబోలు కృత్రిమ గర్భపాత్ర (Artificial Womb) ద్వారా శిశువును తొమ్మిది నెలల పాటు తమ కడుపులో పెంచి సహజ గర్భధారణలాగే జన్మనిస్తాయని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రయోగం చర్చనీయాంశమవ్వడానికి ప్రధాన కారణం.. ప్రకృతికి పూర్తిగా రోబో యంత్రాలు గర్భధారణ అనే ఆలోచన తెరపైకి రావటమే. ఇప్పటికే ఏఐ విప్లవం ప్రపంచాన్ని కుదిపేస్తూ వేల మంది చేసే పనిని క్షణాల్లో పూర్తి చేస్తూ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుండగా మానవ పుట్టుక రూపురేకలను మార్చే హ్యూమనాయిడ్ రోబోలు జన్మనివ్వటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రోబోట్ గర్భంలో కృత్రిమ తల్లి గర్భంలో ఉండే ఉమ్మనీరు నింపి.. న్యూట్రియంట్ ట్యూబ్ ద్వారా పిండానికి ఆహారం అందిస్తారు శాస్త్రవేత్తలు. కాని అత్యంత కీలకమైన అంశం అండం గర్భంలో ఎలా ఇంప్లాంట్ అవుతుంది అన్నదే. దీనిపై ఇంకా స్పష్టత లేదు. గతంలో అమెరికాలో “బయోబ్యాగ్స్”లో నెలలు నిండకుండా పుట్టిన గొర్రెలు కొన్ని వారాలు జీవించగలిగాయి. ఆ సాంకేతికత ఆధారంగా తీసుకుని ఈ ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది.
లాభాలు:
- గర్భధారణలో మహిళలు ఎదుర్కోనే ఆరోగ్య సమస్యలు, ప్రమాదాల నుంచి ఇది రక్షణ కల్పించనుంది.
- సంతానోత్పత్తిలో ఇబ్బందులు పడుతున్న జంటలకు కొత్త ఆశగా ఈ సాంకేతిక మారనుంది.
- సమాజంలో అమ్మతనం పట్ల ఉన్న ఒత్తిళ్లను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
నష్టాలు:
- మానవ గర్భధారణలో జరిగే హార్మోన్ల సమన్వయాన్ని పూర్తిగా పునరుత్పత్తి చేయడం సైన్స్ కి ఇప్పటికీ అసాధ్యమైనదిగా ఉండటం కొత్త సవాలుగా వైద్యులు భావిస్తున్నారు.
- తల్లి-శిశువు మధ్య సహజ అనుబంధం మాయమౌతుందనే ఆందోళనలు ఉన్నాయి.
- రోబోలు గర్భాదారణ చేసి పిల్లలకు జన్మనివ్వటం సమాజంలో నైతిక, చట్టపరమైన ప్రశ్నలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- ఇక కొందరు ఫెమినిస్ట్లు దీన్ని “మహిళల పాత్రకు ముగింపు”గా పరిగణిస్తున్నారు.
ALSO READ : మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఎంచుకోవాలి..
చైనాలో పెరుగుతున్న వృద్ధ జనాభా సమస్య 2007లో 11.9% నుంచి 2020లో 18 శాతాన్ని తాకటాన్ని పరిష్కరించడానికి ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుందని కొందరు సపోర్టర్లు చెబుతున్నారు. కానీ శాస్త్రీయంగా ఇది ఇంకా పూర్తి స్థాయిలో సాధ్యంకాని దశలోనే ఉన్నది. కేవలం ఆలోచన, ప్రదర్శన ప్రోటోటైప్ దశలో ఉన్న ఈ సాంకేతికత వాస్తవంగా మన జీవితాలను మార్చగలదా అనే ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రొటోటైప్ రానున్న ఏడాదిలో దాదాపు రూ.12 లక్షలకు అమ్మకానికి రావొచ్చని నివేదించబడింది.