
Mutual Funds: చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకునేందుకు కేవలం మంచి లాభాలు ఇస్తుంటే చాలు అనే అపోహలో ఉంటుంటారు. ఏదైనా ఫండ్ ఎంచుకునేటప్పుడు కేవలం దాని లాభాలను మార్తమే కంపేర్ చేయటం కాదని.. దానికి మించి గమనించాల్సిన అంశాలు చాలా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. లాభాలు ముఖ్యమైన అంశం అయినప్పటికీ చూడాల్సిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక ఫండ్ మంచి లాభాలను ఇస్తుందంటే కొన్నిసార్లు మార్కెట్ల పనితీరు లేదా కొన్ని రంగాల్లో మంచి వృద్ధి లేదా స్వల్పకాలిక కారణాలు ఉంటుంటాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్ల లాభాలతో పాటు అందులో ఉన్న రిస్క్ తో పాటు రాబడికి తీసుకున్న సమయాన్ని పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి వేరువేరు ఫండ్స్ ఒకే లాభాలు ఇచ్చినప్పటికీ వాటికి ఉన్న రిస్క్ లేదా ఓలటాలిటీ మారుతుంటాయని గుర్తించాలి ఇన్వెస్టర్లు.
ఈ క్రమంలో ఫండ్స్ కంపేర్ చేసేటప్పుడు వాటి స్టాండర్డ్ డీవియేషన్, బీటా, షార్ప్ రేషియో వంటివి గమనించాల్సి ఉంటుంది. అలాగే ఫండ్ ఎంపిక సమయంలో దానిని ఎవరు మేనేజ్ చేస్తున్నారు దానిని ఫ్లోట్ చేసిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏంటి వంటి అంశాలను పరిశీలించాలి. ఎక్కువసార్లు ఫండ్ పనితీరు దానిని మేనేజ్ చేస్తున్న ఫండ్ మేనేజర్ చేతిలో ఆయన తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
ALSO READ : టెక్కీలపై బాంబు పేల్చిన మైక్రోసాఫ్ట్..
ఇక ఫండ్ ఎంపికలో తప్పక చూడాల్సిన అంశం ఎక్స్ పెన్స్ రేషియో అలాగే ఇతర ఖర్చులు. ఇవి చివరిగా మీకు వచ్చే లాభాలను ప్రభావితం చేస్తుంటాయని గుర్తుంచుకోండి. ఇదే సమయంలో ఎంపిక చేసుకునే ఫండ్ ఎలా డైవర్సిఫై చేయబడింది. ఎలాంటి స్టాక్స్ కొన్నారు వంటి అంశాలను కూడా ఇందులో పరిశీలించాలి. ఎక్కువ రంగాల్లోకి డైవర్సిఫై చేయబడిన స్టాక్స్ కలిగిన ఫండ్స్ దీర్ఘకాలంలో మెరుగైన స్టైబుల్ రాబడులను అందిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.