చైనా స్టూడెంట్ మెగా ప్రజెంటేషన్.. చిరు క్రేజ్కు ఫిదా అయిన టీచర్స్

చైనా స్టూడెంట్ మెగా ప్రజెంటేషన్.. చిరు క్రేజ్కు ఫిదా అయిన టీచర్స్

మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయన సాధించిన విజయాల గురించి, ఆయన నుండి స్ఫూర్తి పొందినవారు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి మెగాస్టార్ గా ఎదిగిన ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తి దాయకం. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది తమ తమ రంగాల్లో విజయం సాధించినవారున్నారు. అయితే తాజాగా ఇలాంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అది మన దేశంలో కాదు.. చైనా దేశంలో. 

చైనా రాజధాని బీజింగ్ లో జంజో26 అనే గవర్నమెంట్ స్కూల్ ఉంది. అందులో ఓ టీచర్ స్టూడెంట్స్ కు.. మీకు నచ్చిన ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి ఆడియో ప్రజెంటేషన్ ఇవ్వాలని అసైన్మెంట్ ఇచ్చారు. దానికి సమాధానంగా ఆ స్కూల్లో ఏడవతరగతి చదువుతున్న జస్మిత అనే తెలుగు అమ్మాయి మెగాస్టార్ చిరంజీవి గురించి  ప్రజెంటేషన్ ఇస్తానని చెప్పిందట. కానీ ఆ టీచర్ who Is Chiranjeevi? అని అడిగితే..  గూగుల్ లో మన మెగాస్టార్ విశ్వరూపాన్ని చూపించిందట జస్మిత. అయితే ఆ ప్రజెంటేషన్ లో విదేశీ వ్యక్తులను ఇన్స్పిరేషన్ గా చెప్పడానికి అనుమతించరట. కానీ మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుసుకున్నాక ఆశ్చర్యపోయిన ఆ టీచర్ ''He is Really Inspiring.. Go Ahead'' అని పర్మిషన్ ఇచ్చారట. దాంతో చిరంజీవిపై ఐదు నిమిషాల విజువల్ ప్రదర్శించిన జస్మిత.. అందరి చేత అభినందనలు అందుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.