బాలుడిని కిడ్నాప్ చేసిన చైనా ఆర్మీ

బాలుడిని కిడ్నాప్ చేసిన చైనా ఆర్మీ

చైనా మరోసారి బరితెగించింది. డ్రాగన్ దేశం ఆగడాలకు అంతులేకుండా పోతోంది. సరిహద్దుల్లో రెచ్చిపోతోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని ఎగువ సియాంగ్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలుడిని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బార్డర్ లోకి చొరబడి మరీ అపహరించింది. ఈ విషయాన్ని అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తపిరోగావో స్పష్టం చేశారు. మిరామ్ టారన్ అనే యువకుడిని సియుంగ్లా ప్రాంతంలోని లుంగ్టా జోర్ నుంచి చైనా ఆర్మీ కిడ్నాప్ చేసినట్లు ఎంపీ తపిరో గావో  ట్వీట్ చేశారు.  టారన్ స్నేహితుడు జానీ తప్పించుకుని కిడ్నాప్ గురించి అధికారులకు సమాచారం ఇచ్చాడు. వీరిద్దరూ జిడో గ్రామానికి చెందిన వారు. అరుణాచల్ ప్రదేశ్ లోని త్సాంగ్ పో నది భారత భూభాగంలోకి ప్రవేశించే ప్రదేశానికి సమీపంలో ఈ సంఘటన జరిగిందని ఎంపీ తపిరో గావో చెప్పారు. కిడ్నాప్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిషిత్ ప్రామాణిక్ కు సమాచారం అందించారు. సెప్టెంబర్ 2020లో కూడా చైనా సైనికుులు అరుణాచల్ ప్రదేశ్ లోని ఎగువ సుబంసిరి జిల్లాకు చెందిన ఐదుగురు యువకులను అపహరించి.. వారం తర్వాత విడుదల చేశారు.  ఇప్పుడు మరోసారి చైనా  సైనికులు టారన్ ను కిడ్నాప్ చేసి దుస్సాహసం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే టారన్ ను విడుదల చేయాలని చైనాను డిమాండ్ చేసింది.

మరిన్ని వార్తల కోసం

ఎమ్మెల్యేను తరిమికొట్టిన గ్రామస్థులు

కరోనా మందు డెవలప్ చేసిన బయోఫోర్‌‌‌‌‌‌