ఎమ్మెల్యేను తరిమికొట్టిన గ్రామస్థులు

ఎమ్మెల్యేను తరిమికొట్టిన గ్రామస్థులు

బీజేపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యేను గ్రామస్థులు తరిమి కొట్టారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. త్వరలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ క్రమంలో నియోజకవర్గ ప్రచారానికి వెళ్లారు బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ శైని. ముజఫర్ నగర్ నియోజకవర్గంలో ఓ గ్రామానికి వెళ్లిన ఆయనకు స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యింది. అప్పటికే ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ పై ఆగ్రహంతో ఉన్న అతని సొంత నియోజకవర్గం పరిధిలోని గ్రామస్థులు అతన్ని తరిమికొట్టారు. ఈ ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఖతౌలీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సైనీ బుధవారం ఒక గ్రామంలో సమావేశానికి వచ్చినప్పుడు కోపంగా ఉన్న గ్రామస్థులు అతని కారును వెంటాడి గ్రామం నుంచి తరిమారు.ఎమ్మెల్యే ఓట్లు అడిగేందుకు గ్రామంలోకి రాగానే గ్రామస్థులు  అతని వెనుక అరుస్తూ వెంటాడారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాదిపాటు జరిగిన రైతుల నిరసన తర్వాత ప్రభుత్వం రద్దు చేసిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యే సైనీ తన సొంత నియోజక వర్గాన్ని విడిచి వెళ్లవలసి వచ్చింది.2019లో బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో అసురక్షితంగా భావించే వారిపై బాంబు వేస్తానని ఎమ్మెల్యే సైనీ బెదిరించాడు. దానికి ఒక సంవత్సరం ముందు సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చేనెల 10న యూపీలో ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు రానున్నాయి. 

ఇవి కూడా చదవండి: 

కరోనా మందు డెవలప్ చేసిన బయోఫోర్‌‌‌‌‌‌

దేశంలో ఒక్కరోజే 3 లక్షల కరోనా కేసులు