బోర్డర్ లో బాలుడి ఆచూకీ లభ్యం

బోర్డర్ లో బాలుడి ఆచూకీ లభ్యం

బోర్డర్ లో తప్పిపోయిన అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన బాలుడు మిరామ్ టారోన్ ఆచూకీ లభించింది. ఎట్టకేలకు చైనా ఆర్మీ ఆ యువకుడిని కనుగొందని తేజ్ పూర్ లెఫ్టినెంట్ కల్నల్ హర్షవర్థన్ పాండే తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ లోని సియుంగ్లా పరిధిలోని లుంగ్టా జోర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల మిరామ్ టారోన్ గా గుర్తించారని తెలిపారు. ఈనెల 18న టారోన్ అదృశ్యమయ్యాడు. భారత భూబాగం నుంచి బాలుడిని చైనా ఆర్మీ అపహరించిందని ఎంపీ తపిర్ గావో ఆరోపించారు. టారోన్ ను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. అరుణాచల్‌ ప్రదేశ్‌- చైనా సరిహద్దుల్లో తప్పిపోయిన బాలుడు మీరామ్ టారోన్‌ను తమకు అప్పగించాలని  భారత సైన్యం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని కోరింది. 


మరిన్ని వార్తల కోసం

ప్రియాంక వ్యాఖ్యలపై మాయావతి కౌంటర్

ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు రీహార్సల్స్