ట్యాక్స్‌‌‌‌ ఎగ్గొట్టిందని..నటికి రూ. 330 కోట్ల ఫైన్‌‌‌‌

ట్యాక్స్‌‌‌‌ ఎగ్గొట్టిందని..నటికి రూ. 330 కోట్ల ఫైన్‌‌‌‌

బీజింగ్‌‌‌‌: ట్యాక్స్‌‌‌‌ ఎగ్గొట్టిన టాప్​ యాక్ట్రెస్ కు  చైనా అధికారులు భారీ జరిమానా విధించారు. రూ. 330 కోట్లు కట్టాలని ఆదేశాలు జారీ చేశారు. చైనాలో జెంగ్‌‌‌‌ షువాంగ్‌‌‌‌ ప్రముఖ టీవీ, సినిమా నటి. 2019, 2020ల్లో ఆమె నటించిన సినిమాలు, టీవీ సిరీస్‌‌‌‌ల కోసం తీసుకున్న పేమెంట్‌‌‌‌కు సంబంధించి సరిగా పన్ను కట్టలేదని షాంఘై మున్సిపల్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ గుర్తించింది. దీంతో శుక్రవారం పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. చైనాలో ప్రజల మధ్య సంపదలో తేడాలను తగ్గించేందుకు ఆ దేశం తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం సెలబ్రిటీలపై అక్కడి సర్కారు నిఘా పెరిగింది. పన్ను ఎగవేస్తున్నవాళ్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. చైనా చట్టాలను పాటించని నటీనటుల షోలను ప్రసారం చేయరు. ఈ నేపథ్యంలో నటి జెంగ్‌‌‌‌ నటించిన ప్రోగ్రామ్‌‌‌‌లను ప్రసారం చేయబోమని నేషనల్‌‌‌‌ రేడియో, టెలివిజన్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ శుక్రవారం వెల్లడించింది. సరోగసీ ద్వారా జన్మనిచ్చిన ఇద్దరు శిశువులను అమెరికాలో వదిలేసిందనే ఆరోపణలపై జెంగ్‌‌‌‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.