న్యూఢిల్లీ: ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే కోసం వేసిన రెండు చైనీస్ కంపెనీల బిడ్స్‌ను ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. మిగిలిన బిడ్డర్ల కంటే ఈ రెండు కంపెనీలు తక్కువకే బిడ్స్ వేసినప్పటికీ ప్రభుత్వంఈ నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ క్యలిరెన్స్‌లో సమస్యల వలనే వీటి బిడ్స్‌ను రిజెక్ట్ చేశామని రోడ్ ట్రాన్స్‌పోర్ట్, హైవేస్ మినిస్ట్రీ పేర్కొంది. ఈ రెండు కంపెనీలు జింగ్సీ కన్స్‌స్ట్రక్షన్ ఇంజినీరింగ్ కార్పొరేషన్ సబ్సిడీలు. ఈ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్ట్ అంచనా రూ. 800 కోట్లుగా ఉంది. రెండు చైనీస్ కంపెనీలకు లెటర్స్ ఆఫ్ అవార్డ్ ఇవ్వడాన్ని నిలిపివేశామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. సెకెండ్ లో యెస్ట్‌గా బిడ్స్ వేసిన వారికి ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఆఫర్ చేస్తామని అన్నారు. దేశంలోని హైవే ప్రాజెక్ట్ ల నిర్మాణంలో చైనీస్ కంపెనీలకు, చైనీస్ కంపెనీ జాయింట్ వెంచర్‌గా ఉన్నా కంపెనీలకు అనుమతులివ్వమని రోడ్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్ట్రీ నితిన్ గడ్కరీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇండియన్ రైల్వేస్ కూడా చైనీస్ కంపెనీకిచ్చిన రూ. 471 కోట్ల సిగ్నలింగ్ కాంట్రాక్ట్ ను తాజాగా రద్దు చేసింది. 417 కి.మీ కాన్పూర్–దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ సెక్షన్‌కు సిగ్నలింగ్, టెలీకమ్యునికేషన్ వర్క్ కోసం ఓ చైనీస్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇప్పటివరకు కేవలం 20 శాతం వర్క్ మాత్రమే ఈ కంపెనీ పూర్తి చేసిందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఇండియన్ రైల్వే పేర్కొంది.

