ఢిల్లీలో నేపాలీ సన్యాసిగా చైనీస్ మహిళ..పోలీసుల అరెస్ట్

ఢిల్లీలో నేపాలీ సన్యాసిగా చైనీస్ మహిళ..పోలీసుల అరెస్ట్

దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగాలపై ఓ చైనా మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బౌద్ధ సన్యాసిగా జీవిస్తూ చైనా తరుపున గూఢచర్యం చేస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను చైనాలోని హెనాన్ ప్రావిన్సుకు చెందిన కైరువోగా పోలీసులు గుర్తించారు. డోల్మా  లామాగా పేరు మార్చుకుని బౌద్ధ సన్యాసిగా జీవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తర ఢిల్లీలోని టిబెటన్ శరణార్థుల కాలనీ మజ్ను కా తిలాలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఆమె వద్ద నేపాల్ పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో విచారించినప్పుడు సదరు మహిళ చైనా పౌరురాలని తేలిందన్నారు. 2019లో ఆమె భారత్కు వచ్చినట్లు చెప్పారు. విచారణ సమయంలో తనను చైనా కమ్యూనిస్ట్ పార్టీలోని కొంతమంది నేతలు చంపాలని చూస్తున్నారని వెల్లడించినట్లు తెలిపారు. ఇంగ్లీష్, నేపాలీ, చైనీస్ భాషల్లో మహిళ మాట్లాడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.