
ఉత్తరాఖండ్లో జరిగిన 20వ జాతీయ ఐస్ స్కేటింగ్ చాంపియన్షిప్లో బాలాపూర్ మండలం మామిడిపల్లికి చెందిన చిన్నారి చెనస్యగౌడ్ సత్తా చాటింది. జూనియర్ స్కేటింగ్ విభాగంలో అద్భుతమైన ప్రదర్శనతో రజత పతకం సాధించింది. సోమవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న చెనస్యకు క్రీడాకారులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. చెనస్య మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. - వెలుగు, శంషాబాద్a