చంద్రబాబు లాంటి దుర్మార్గుడు లోకంలోనే లేరు: చీరాల ఎమ్మెల్యే కర్ణం బలరాం

చంద్రబాబు లాంటి దుర్మార్గుడు లోకంలోనే లేరు: చీరాల ఎమ్మెల్యే కర్ణం బలరాం

చీరాల ఎమ్మెల్యే కర్ణం బలరాం టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఇంకొల్లు టీడీపీ సభలో చంద్రబాబు తనపై అసభ్య పదజాలంతో అవాకు చవాకులు పేల్చారు. దీనివెనుకాల ఎవరున్నారో అందరికీ తెలుసు. చంద్రబాబుకు స్లిప్పులిచ్చి మాట్లాడించారు. తనను దుర్మార్గుడంటూ దూషించారు. చీరాలలో ఆయనేదో నన్ను గెలిపించినట్లు.. దుర్మార్గుడని అన్నారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ మారాడని.. ఆయనంత దుర్మార్గుడిని చూడలేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు కంటే దుర్మార్గుడిని ఈ లోకంలోనే చూడలేదని కరణం బలరాం మండిపడ్డారు. నిజంగానే నువ్వు నన్ను గెలిపించి ఉంటే.. మంగళగిరిలో నీ కొడుకును ఎందుకు గెలిపించలేకపోయావని ఎద్దేవా చేశారు.

2019లో నిన్ను, నీ కొడుకును ఎవరోతిట్టారని ఆ దురద తీర్చుకునేందుకు నన్ను ఆనాడు చీరాలకు చంద్రబాబు పంపారు.. నా సత్తాతోనే చీరాలలో గెలిచాను. చంద్రబాబుకు నిజంగా నన్ను గెలిపించే అంత సత్తాఉంటే మంగళగిరిలో లోకేశ్ ను ఎందుకు గెలిపించలేక పోయావు అంటూ కర్ణం బలరాం ప్రశ్నించారు. 2016లో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో కొన్నట్లు ఎలా కొన్నావు.. అప్పట్లో పార్టీకి నష్టం వస్తుందని విభేదించిన ఆయన నిర్ణయం మేరకే పోయారు.  చంద్రబాబు హద్దుల్లో ఉండి మాట్లాడితే బాగుంటుంది.. ఇంకోసారి నా గురించి మాట్లాడితే ఊరుకునేది లేదంటూ కర్ణం బలరాం హెచ్చరించారు.