ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు 25 ఏళ్లు..చిరంజీవి ఎమోషనల్‌ పోస్ట్‌

 ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు 25 ఏళ్లు..చిరంజీవి ఎమోషనల్‌ పోస్ట్‌

మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ స్థాయి రావడం కోసం ఎంతో కృషి చేశారు. తన సామాజిక దృక్పథాన్ని చాటుకోవడానికి ఎన్నో రకాలుగా సేవలందిస్తున్నారు. అందులో ముఖ్యమైనది చెప్పాలంటే చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌(CCT1998 Oct 2nd) ఏర్పాటు చేయడం. ఈ ట్రస్ట్‌ను(Chiranjeevi Charitable Trust) మొదలుపెట్టి నేటితో పాతికేళ్లు పూర్తయియినా సందర్భాన తన మనసులోని మాటను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. 

‘‘దేశ ప్రజలందరికీ ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఈ సందర్భంగా నేను చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభించిన  ఆనాటి క్షణాలను గుర్తు చేసుకోవాలనుకుంటున్న.ఈ  25 ఏళ్ల ప్రయాణం ఎంతో అద్భుతమైనది. 

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటివరకూ 10 లక్షల బ్లడ్‌ యూనిట్లను సేకరించి ఆపదలో అవసరమైన వారికి అందజేశాం. 10 వేల మందికి కంటిచూపు వచ్చేలా చేశాం. కరోనా మహమ్మారిలో వేల మందికి సాయం చేసి ప్రాణాలని నిలుపగలిగాం. తోటి మానవాళికి ఆపదను గుర్తించి సాయం చేయడం వల్ల పొందిన సంతృప్తిని మాటల్లో వర్ణించలేం. సీసీటీ వేదికగా మానవతా సామాజిక కార్యక్రమాల్లో అందరు  భాగమై తమ వంతు సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికీ సెల్యూట్‌ చేస్తున్నా. ఇది మన దేశానికి మనం చేస్తున్న చిన్న చిరు సాయం ఇది.. అంటూ చిరు తన ఎక్స్‌ ఖాతాలో ఎమోషన్ పోస్ట్‌ పెట్టారు

చిరంజీవి ఛారిటీ ద్వారానే కాకుండా కష్టంలో ఉన్న బాధితులకు అండగా నిలబడటంలో ముందుటారాయన. తన వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సామాజిక కార్యక్రమాల ద్వారా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికీ ప్రతిక్షణం చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నారు. తన నుంచి వచ్చే సినిమా స‌క్సెస్ కావడం కంటే ఆప‌ద‌లో ఉన్న వారిని సకాలంలో ఆదుకున్న‌పుడు..క‌లిగే ఆత్మ సంతృప్తి చాలా గొప్ప‌ది. ఆ రోజు ఎంతో ప్ర‌శాంతంగా నిద్ర‌పోతాను అంటూ ఎన్నో వేదికల ద్వారా  చిరు వెల్లడించారు.