
ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతికి తెలుగు సినీ పరిశ్రమ అగ్రనటుడు చిరంజీవి సంతాపం తెలిపారు. వేణుమాధవ్ అకాలమరణం దిగ్ర్భాంతిని కలిగించిందన్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు చిరంజీవి.
మాస్టర్ సినిమాలో మొట్టమొదటిసారి వేణుమాధవ్, తాను కలిసి నటించామని చెప్పారు చిరంజీవి. ఆ తర్వాత అనేక సినిమాల్లో కమెడియన్ గా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే పాత్రలు వేశారని అన్నారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని వేణుమాధవ్ దక్కించుకున్నాడని చిరంజీవి చెప్పారు. వేణుమాధవ్ ను దృష్టిలో ఉంచుకుని.. రచయితలు , డైెరెక్టర్లు పాత్రలు క్రియేట్ చేసి.. డైలాగులు రాసేవాళ్లని అన్నారు చిరంజీవి.
టాలీవుడ్ లో వేణుమాధవ్ కు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందని అనుకునేవాడిననీ… కానీ.. చిన్నవయసులోనే ఆయన కన్నుమూయడం బాధాకరంగా ఉందని చిరంజీవి అన్నారు. వేణుమాధవన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.