తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి శుభాకాంక్షలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy)కి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నేడు(డిసెంబర్ 7) సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందులో భాగంగా గవర్నర్ తమిళిసై సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపడుతూ ప్రమాణం చేశారు రేవంత్ రెడ్డి.

ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ కొత్తగా భాద్యతలు తీసుకుంటున్న మంత్రులకు మెగాస్థార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.. తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు.. మంత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ నాయకత్వంలో మన రాష్ట్రం ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను.. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది.