
టాలీవుడ్ స్టార్ హీరో, జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan Birthday) సెప్టెంబర్ 2న తన 52వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, జనసైనికులు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Dearest Kalyan Babu ,
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2023
జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో,
నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ,
ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ,
నీకు జన్మదిన శుభాకాంక్షలు! ???
Happy Birthday… pic.twitter.com/pkry6DtwGA
ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి(Chirajneevi) తన తమ్ముడు జన్మదినం సందర్భంగా పవన్‌కు స్పెషల్ విషెస్ గా తెలిపారు.. ప్రియమైన కళ్యాణ్ బాబు.. జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ.. ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ, కల్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు.. అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్. ఈ పోస్ట్ తో పాటు చిరు తన తమ్ముళ్ళతో దిగిన ఫొటోను షేర్ చేశారు