Chiranjeevi Gift: డైరెక్టర్ బాబీకి చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్.. వాచ్ మోడల్ ఏంటీ? ఖరీదు ఎన్ని లక్షలు?

Chiranjeevi Gift:  డైరెక్టర్ బాబీకి చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్.. వాచ్ మోడల్ ఏంటీ? ఖరీదు ఎన్ని లక్షలు?

తన అభిమానులు దర్శకులై తనతో సినిమాలు తీస్తే చిరంజీవి మురిసిపోతుంటారు. అభిమానులే తనకు అన్నీ అనుకునే చిరు.. తన వీరాభిమానికి అద్భుతమైన బహుమతి ఇచ్చారు. దర్శకుడు బాబీ కొల్లికి చిరు ప్రేమతో ఖరీదైన కనుక ఇచ్చాడు. చిరంజీవి డైరెక్టర్ బాబీని స్వయంగా తన ఇంటికి పిలిచి ఓ కాస్ట్లీ వాచ్ ను కానుకగా అందించారు. 

లేటెస్ట్గా బాబీ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "బాస్ స్వయంగా ఇచ్చిన అందమైన మెగా సర్‌ప్రైజ్..ఈ అమూల్యమైన బహుమతినిచ్చిన మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు. మీ ప్రేమ, ప్రోత్సాహం ఆశీర్వాదాలు నాకు ప్రపంచం అన్నయ్య. ఈ క్షణాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను" అని పోస్టులో వెల్లడించాడు.

ఇందులో స్వయంగా చిరునే బాబీ చేతికి  వాచ్ తొడగడం అందరినీ ఆకర్షిస్తుంది. ఈ వాచ్ విషయానికి వస్తే.. ఒమేగా సీమాస్టర్ డైవర్ 300 M మోడల్ కి చెందినది. ఈ వాచీ విలువ ఆన్‌లైన్‌లో వెల్లడించిన ప్రకారం రూ.4,88,335 లక్షలు అని చూపిస్తుంది. 

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అన్నయ్య అందరివాడు.. అందులో అభిమానులకు ఎప్పుడు అండగా ఉంటాడు.. ఇలా ప్రేమించే దర్శకులకు విలువైన బహుమతులు ఇస్తుంటుంటాడని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

ఇకపోతే చిరు-బాబీ కలయికలో వాల్తేరు వీరయ్య వచ్చింది. ఈ మాస్ ఎంటర్టైనర్ భారీ విజయాన్ని సాధించింది. చిరంజీవి మాస్ ప్రెజెంటేషన్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ వెరసి సినిమాను నెక్స్ట్ లెవల్లో  నిలబెట్టింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.108 కోట్ల గాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా రూ.236 కోట్ల రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది.

ఇక ఇప్పుడు చిరంజీవితో మరో సినిమాకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం చిరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల సినిమాల తర్వాత బాబీతో సినిమాకు సిద్దమయ్యాడు. ఇప్పటికే కథ చర్చలు ముగిసాయి. చిరుకి స్క్రిప్ట్ బాగా నచ్చడంతో ఒకే చెప్పినట్లు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.