
తమ్ముడు పవన్ కళ్యాణ్ తో సినిమాపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. పవర్ స్టార్ తో కలిసి సినిమా చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు.. తప్పకుండా చేస్తాను అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం పవన్ చాలా బిజీగా ఉన్నాడని, తాను కూడా మరికొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. అందుకే రెండేళ్ల తర్వాత పవన్ తో సినిమా గురించి ఆలోచిస్తానని క్లారిటీ ఇచ్చారు. వాల్తేరు వీరయ్య మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరు ఈ కామెంట్లు చేశాడు. అయితే మెగాస్టార్ తలుచుకుంటే తప్పకుండా పవన్ తో సినిమా చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతోంది. చిరంజీవికి జంటగా శ్రుతిహాసన్ నటిస్తోంది. ఇందులో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేసింది. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, విజయ్ ‘వారసుడు’ చిత్రాలు జనవరి 12న రిలీజ్ కానున్నాయి. చిరంజీవి సినిమా రిలీజ్ డేట్ కూడా ఖరారు కావడంతో.. ఈ మూడింట్లో సంక్రాంతి విజేతగా ఎవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.