Jana Nayagan Leak: ‘జన నాయగన్’ లీక్‌పై చిరంజీవి ఆగ్రహం.. సినీ ఇండస్ట్రీకి ఫుల్ సపోర్ట్ అంటూ పోస్ట్

Jana Nayagan Leak: ‘జన నాయగన్’ లీక్‌పై చిరంజీవి ఆగ్రహం.. సినీ ఇండస్ట్రీకి ఫుల్ సపోర్ట్ అంటూ పోస్ట్

‘జన నాయగన్’ మూవీ లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా స్పందించారు. తలపతి విజయ్ నటించిన ఈ సినిమాకు సంబంధించిన లీక్ ఘటన బాధాకరమని, పైరసీ సినిమా పరిశ్రమను దెబ్బతీస్తుందని ఆయన Xలో పేర్కొన్నారు. ఈ విపత్కర సమయంలో నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌కు మద్దతుగా నిలుస్తూ, దోషులను శిక్షించాలని కోరారు. ఈ మేరకు “పైరసీని అరికట్టాలి.. సినిమాను కాపాడాలి” అని అన్ని భాషల సినిమా పరిశ్రమలకు చిరు పిలుపునిచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ‘జన నాయగన్’ విడుదల అవుతుందని అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అయితే  థియేటర్లలోకి రాకముందే సినిమా మొత్తం పైరసీ వెబ్‌సైట్లలో ప్రత్యక్షమవ్వడం చిత్ర యూనిట్‌ను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటికే లీక్ ఘటనపై సినీ స్థార్స్ తమ గళం విప్పుతున్నారు. తమిళ హీరో శివ కార్తికేయన్, మెగాస్టార్ చిరంజీవి తమ సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తూ తమ సపోర్ట్ అందించారు. 

►ALSO READ | OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 18కి పైగా సినిమాలు.. తప్పక చూడాల్సిన బెస్ట్ లిస్ట్ ఇదే

చిరంజీవి X వేదికగా స్పందిస్తూ.. “జన నాయగన్ లీక్ కావడం చాలా బాధాకరం. సినిమా అనేది నమ్మకం, కష్టం, మరియు ఎంతో మంది కలల సమాహారం. ఇలాంటి ఘటనలు మొత్తం ఇండస్ట్రీపై ప్రభావం చూపుతాయి. మన సృజనాత్మక కృషిని రక్షించడం ఎంత ముఖ్యమో ఇది గుర్తు చేస్తుంది. ఈ సమస్యను అదుపులోకి తీసుకురావడంలో, దోషులను శిక్షించడంలో KVN ప్రొడక్షన్స్‌తో మేమంతా ఒక్కటిగా ఉన్నాం. మనం అందరం కలిసి సినిమాను గౌరవిద్దాం, రక్షిద్దాం. పైరసీని అరికట్టి.. సినిమాను కాపాడుకుందాం,” అని చిరంజీవి Xలో రాశారు. చిరంజీవి చేసిన ఈ ట్వీట్, ‘జన నాయగన్’ చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌కు మాత్రమే కాకుండా, ఆయన రాబోయే సినిమాకూ పెద్ద మోరల్ సపోర్ట్‌గా మారింది.

హీరో శివ కార్తికేయన్ స్పందిస్తూ.. “ప్రతి సినిమా వందలాది మంది కష్టపడి, తమ ప్యాషన్‌, రక్తం, చెమటతో రూపొందించబడుతుంది. దయచేసి పైరసీకి దూరంగా ఉండండి. థియేటర్‌లో విడుదలయ్యే వరకు వేచి చూసి, సినిమాను అక్కడే చూడండి. ఈ ఘటనకు బాధ్యులైన వారు కఠిన చర్యలను ఎదుర్కోవాలి. ప్రతిభను గౌరవించండి. కష్టాన్ని గౌరవించండి. సినిమా పరిశ్రమను గౌరవించండి” అని ట్వీట్ చేశారు.