Chiranjeevi :వయనాడ్ విషాదం..కేరళ ముఖ్యమంత్రికి కోటి రూపాయల చెక్‌ అందించిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi :వయనాడ్ విషాదం..కేరళ ముఖ్యమంత్రికి కోటి రూపాయల చెక్‌ అందించిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి & రామ్ చరణ్ కలిసి కేరళ లోని వయనాడ్‌ బాధితులకు ఆర్థికసాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌ కు తమ వంతు సాయంగా చిరు, చరణ్ సంయుక్తంగా కోటీ రూపాయ‌ల విరాళాన్ని ప్రకటించారు.

ఈ క్ర‌మంలో (గురువారం) సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి కేర‌ళకు వెళ్లారు. త్రివేండ్రంలో విమానాన్ని దిగిన వెంట‌నే చిరు నేరుగా కేర‌ళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయానికి  వెళ్లారు. అక్క‌డ సీఎం విజ‌య‌న్‌తో భేటీ అయ్యి ప్రస్తుత పరిస్థితులు ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వయనాడ్ బాధితుల కోసం ప్రకటించిన రూ.కోటి రూపాయ‌ల చెక్కును ముఖ్య‌మంత్రికి అంద‌జేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ కావడంతో రీల్ హీరోస్ మాత్రమే కాదు రియల్ హీరోస్ అంటూ నెటిజన్స్ స్పందిస్తున్నారు. 

గత ఆదివారం చిరు తన ట్వీట్‌ లో.."ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం, వందలాది విలువైన ప్రాణాలను కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. వయనాడ్ దుర్ఘటన బాధితులకు నా హృదయం వెల్లివిరుస్తోంది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చరణ్, నేను కలిసి రూ.1 కోటి విరాళంగా బాధితులను ఆదుకుంటున్నాం" అని రాసుకొచ్చారు.