
చిరంజీవి(Chiranjeevi) హీరోగా బింబిసార(Bimbisara) ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. మెగా మాస్ యూనివర్స్ బిగిన్స్ అంటూ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఫాంటసీ అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. నెక్స్ట్ షెడ్యూల్‌ను ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి మొదలుపెడుతున్నారు. చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రమిది. ఇందులో భీమవరం దొరబాబు అనే పాత్రను చిరంజీవి పోషిస్తున్నట్టు, అలాగే ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.