సర్కారు నౌకరి మూవీ ట్రైలర్‌‌ విడుదల

సర్కారు నౌకరి మూవీ ట్రైలర్‌‌ విడుదల

సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా గంగనమోని శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు నౌకరి’. భావన హీరోయిన్. ఆర్కే టెలీ షో బ్యానర్‌‌‌‌‌‌‌‌పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. జనవరి 1న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్‌‌ను చిరంజీవి విడుదల చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. ఇక ట్రైలర్‌‌ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకులు అనిల్ రావిపూడి, శేఖర్ కమ్ముల, రచయిత బీవిఎస్ రవి అతిథులుగా హాజరై సినిమా విజయం సాధించాలని విష్ చేశారు. 

రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘నా చేతుల మీదుగా పరిచయమైన ఎంతోమంది నటీనటులు గొప్ప స్థాయిలో ఉన్నారు. ఆకాష్ కూడా ఆ స్థాయిలో నిలవాలి. తన నటన చూశాక మరే హీరో ఈ కథకు న్యాయం చేయలేడు అనిపించింది. అలాగే భావన నటన చూస్తే మహానటి సావిత్రిలా పేరు తెచ్చుకుంటుంది అనిపించింది. ఇదొక ఎమోషనల్ మూవీ. సందేశాత్మకంగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది’ అన్నారు. 

సునీత మాట్లాడుతూ ‘మా అబ్బాయి హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం కనుక నా జీవితానికి సరిపడా సంతృప్తినిచ్చిన సినిమా ఇది’ అన్నారు. ‘ఒక నటుడికి మొదటి అవకాశం ఎంతో ముఖ్యం. అలాంటి అవకాశాన్ని ఇచ్చిన రాఘవేంద్రరావు గారికి, దర్శకుడు శేఖర్‌‌‌‌‌‌‌‌కి థ్యాంక్స్ అని చెప్పాడు ఆకాష్. ఇది హీరోయిన్‌‌‌‌గా తనకు దక్కిన మంచి అవకాశం అనిభావన చెప్పింది. దర్శకుడు  శేఖర్ మాట్లాడుతూ ‘రియల్ ఇన్సిడెంట్స్‌‌‌‌ ఆధారంగా తెరకెక్కించాం. కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ షూటింగ్ చేశాం’ అన్నాడు. తనికెళ్ల భరణి, దర్శకుడు వీఎన్‌‌‌‌ ఆదిత్య, మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ పీసపాటి, లిరిక్ రైటర్ సిరాశ్రీ తదితరులు పాల్గొన్నారు.