మళ్లీ రాజకీయాల్లోకి రావడం జరగదు

మళ్లీ రాజకీయాల్లోకి రావడం జరగదు

రాజ‌కీయాల‌కు తాను దూర‌మ‌ని హీరో మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. వైసీపీ నాకు రాజ్యసభ ఆఫ‌ర్ చేసింద‌నేది అవాస్తవమన్నారు. నేను అలాంటి ఆఫ‌ర్లు కోరుకోన‌ని స్పష్టం చేశారు. రాజ‌కీయాల‌కు తాను దూర‌మ‌ని చిరంజీవి మ‌రోసారి క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.  ప‌ద‌వులు ఆశించే  వ్యక్తిని కాదన్నారు చిరంజీవి. రాజ్యసభ  సీటు అనే మాట కేవ‌లం ప్రచార‌మ‌ని తెలిపారు. అస‌త్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని స్పష్టం చేశారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యానని తేల్చి చెప్పారు. నిన్న ఏపీ సీఎం జగన్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను సినిమా టికెట్ల అంశంపై సీఎంతో చర్చించానని స్వయంగా చిరంజీవి తెలిపారు.